Nallari Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో బీజేపీ గూటికి చేరిన తర్వాత ఏపీకి వచ్చిన అతనికి ఆ పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక ఏపీలో రాజకీయంగా ఆయన ఇకపై నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తారని అందరూ భావిస్తున్నారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో బీజేపీ పార్టీ బలం ఏపీలో పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇక జనసేన పార్టీ కూడా తన వ్యూహాలని మార్చుకొని బీజేపీతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ వచ్చిన తర్వాత ఆయన మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా అంశాలపై ఆయన తన అభిప్రాయాలని తెలియజేశారు. తన తమ్ముడు కిషోర్ రెడ్డి టీడీపీలో చేరిన తరువాత అతని ఇంటికి కూడా వెళ్లలేదు. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని, పదవులు ఆశించి కాదన్నారు. బీజేపీ నుంచి ఓ ముఖ్య నేత తనను సంప్రదించారని, ఆ తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపైనా ఆయన మాట్వైలాడారు. నష్జాటాలలో ఉండటం వలనేగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తుందని అన్నారు. అలాగే రాజధాని విషయంలో బీజేపీ నిర్ణయమే తన అభిప్రాయం అని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి, అక్కడే పెరిగి, హెచ్‌పీఎస్, నిజాం కాలేజీల్లో చదువుకున్నానని, సొంత ఊరు ఏపీలోని చిత్తూరు అన్నారు. తనకు బెంగళూరులో కూడా ఇల్లు ఉందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు.