తెలుగు చిత్రాలలో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ హౌస్ మేట్ అమిత్ తివారి హీరోగా పరిచయం అవుతున్న నల్లమల మూవీ టీజర్ ను తాజాగా దర్శకుడు దేవ కట్టా విడుదల చేశారు.ఈ మూవీలో అమిత్ సరసన ప్రముఖ యాంకర్ భానుశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీకి రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.1980 జులై 23 ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులవి అప్పుడప్పుడే నల్లమలలో అంతర్యుద్ధం మొదలైంది అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ మూవీ టీజర్ సినీ అభిమానులను ఆకర్షిస్తుంది.