BIGG BOSS: బిగ్ బాస్ రియాలిటీ షో రోజు రోజుకు ఆసక్తికరంగానే మారుతోంది. ఐదు షోలు విజయవంతగా పూర్తి చేసుకుని ప్రస్తుతం సీజన్ సిక్స్ లో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. నేటితో సీజన్ సిక్స్ మూడు వారాలు పూర్తి అవుతుంది. ఇప్పటికే హౌస్ లో అభినయ, షానీ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. శనివారం ఎపిసోడ్ లో మాత్రం హోస్ట్ నాగార్జున ఎవరినీ హౌస్ లో నుండి బయటకు పంపలేదు.
బిగ్ బాస్ రియాలిటీ షో హిస్టరీలోనే తొలిసారి ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. గత వారంలో హౌస్ లో సరైన ప్రదర్శన లేని కారణంగా కొంత మంది కంటెస్టెంట్స్ ని సోఫా వెనకాల నిలబెట్టి మరీ క్లాస్ పీకారు నాగార్జున. దీంతో మూడో వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దాదాపు సీరియస్ గా తీసుకున్నారు. కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యేందుకు బిగ్ బాస్ ఇచ్చిన అడవిలో ఆటలో భాగంగా కంటెస్టెంట్స్ ఒకరిద్దరు మినహా అందరూ వారి ప్రదర్శనతో అదరగొట్టారు.

ఇక శనివారం ఎపిసోడ్ లో ఈ మూడో వారం మొత్తం ఎవరు ఎంతలా ప్రదర్శన చూపారు అనేద దానికి హోస్ట్ నాగార్జున మార్కులు వేస్తూ వచ్చారు. దీంతో పాటు గత వారం మాదిరిగానే ఈ వారం కూడా సోఫా వెనకాల కొంత మంది కంటెస్టెంట్స్ ని నిలబెట్టాడు. ఇందులో వాసంతీ, బాలాదిత్య, చంటి, సుదీప, అర్జున్, రాజ్, రోహిత్ అండ్ మెరీనా, కీర్తిలు ఉన్నారు. వీరికి నాగార్జున ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.
సోఫా వెనకాల ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ లో తాను ఇద్దరిని వచ్చే వారం ఎలిమేనేట్ కి నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఫస్ట్ టైం తీసుకుంటున్నట్లు చెప్పిన నాగార్జున…. ఇంటి సభ్యుల అభిప్రాయాలను సేకరించి సోఫా వెనకాల ఉన్న వారిలో ఎవరి ప్రదర్శన ఎలా ఉందనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తారు. సోఫాలో కూర్చున్న కంటెస్టెంట్స్ ఓటింగ్ అభిప్రాయం ప్రకారం అర్జున్, కీర్తిలను నాగార్జున నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుని వారిద్దరికీ పెద్ద షాక్ ఇస్తారు.