Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున అదే జోష్ లో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమాలో నటించారు.నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటించిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీకి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
ఇకపోతే సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే చిన్న సినిమా నుంచి మొదలుకొని పెద్ద సినిమాల వరకు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పూర్తిగా తమ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తారు. అయితే నాగార్జున సినిమా విషయంలో మాత్రం సినిమాపై ఎక్కడ ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదని చెప్పాలి. ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో చిత్ర బృందం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు.
విజయదశమి రోజు ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి పోటీగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో సినిమాలపై అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. అయితే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ నాగార్జున మాత్రం తన సినిమా విషయంలో మౌనం వహిస్తున్నారు.
Nagarjuna: అభిమానులలో మొదలైన ఆందోళన
ఇటీవల కాలంలో నాగార్జున నటించిన సినిమాలు ఊహించని స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయితే ఈయనకు బంగార్రాజు సినిమా కాస్త ఊరటనిచ్చిన అభిమానులు మాత్రం నాగర్జున ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదని భావిస్తున్నారు.అయితే గోస్ట్ సినిమా ద్వారా ఆయన నాగార్జున మంచి హిట్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడంలోనే చిత్ర బృందం ఫెయిల్ కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.