Nagarjuna: నాగార్జున పరిచయం అవసరం లేని పేరు అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఇప్పటికి సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున తన తదుపరిచిత్రం 100వ సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు నాగార్జున ఎన్నో విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగార్జున ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలతో పాటు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో కూడా నటించారు. ఇకపోతే తాజాగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా అనంతరం నాగార్జున ఎలాంటి సినిమాలు చేయబోతున్నారని అభిమానులు సైతం ఒకవైపు ఆందోళనలో ఉన్నారు.
నాగార్జున తన కెరీయర్ లో 100వ సినిమా కావడంతో ఇతను ఏ జోనర్ లో సినిమాని ఎంపిక చేసుకుంటారని విషయంపై ఒకవైపు అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా నాగార్జున సైతం ఈ సినిమా విషయంలో కాస్త ఆందోళనగానే ఉన్నట్టు తెలుస్తుంది.100వ చిత్రాన్ని ఇలాంటి కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తారో తెలియాల్సి ఉంది.ఇలా నాగార్జున నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
Nagarjuna: సినీ కెరియర్ లో గుర్తుండిపోయేలా 100 వ సినిమా…
ఈ క్రమంలోని తన వందవ సినిమా తన సినీ కెరియర్ లోనే గుర్తుండిపోయే విధంగా ఉండేలా ప్లాన్ చేయాలని భావిస్తున్నారట.అందుకే 100 సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.