Nagarjuna : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంతలు ఇండస్ట్రీలోనే బెస్ట్ కపుల్ అని.. క్యూట్ కపుల్ అని అనిపించుకున్నారు. వీరిద్దరికీ సంబంధించి ఏ ఫోటో బయటకు వచ్చినా కూడా అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యేవారు. అన్యోన్య దాంపత్యం అంటూ కొనియాడేవారు. అలాంటి జంట విడిపోబోతోందన్న వార్త అన్ని ఇండస్ట్రీల్లోనూ సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ వార్తను అభిమానులైతే అసలు జీర్ణించుకోలేకపోయారు. నిజమా? కాదా? అన్న సంశయంలో ఉన్నారు. అధికారిక ప్రకటన రావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వారు విడిపోవడానికి కారణం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీసేనంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిలో నిజమెంతో కానీ అసలు నిజం మాత్రం వెలుగులోకి రాలేదు.
నాలుగేళ్ల దాంపత్య జీవనం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు. అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్త ఏదో ఒకటి నెట్టింట వైరల్ అవుతూనే వస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య, సమంత ఇద్దరూ వారి డివోర్స్‌పై మీడియా ముఖంగానే సమాధానం ఇచ్చారు. చైతన్య అయితే ఇద్దరం గౌరవంగానే విడిపోయాం. మేం చెప్పాల్సింది చెప్పేశాం అని వెల్లడించాడు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకూ నాగార్జున ఓపెన్ కామెంట్స్ ఏమీ చేయలేదు. కానీ తాజాగా ఆయన కూడా స్పందించాల్సి వచ్చింది. రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సినిమా సక్సెస్ సందర్భంగా నాగార్జున ముంబై వెళ్లినప్పుడు అక్కడి మీడియా చైతు, సామ్ విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది.
Nagarjuna : మా జీవితాల నుంచి అది వెళ్లిపోయింది..
దీనికి నాగ్ ఓపెన్‌గానే సమాధానం ఇచ్చారు. ‘నాగ చైతన్య సినిమాల కంటే అతని వ్యక్తిగత జీవితంపై చర్చ జరగటం అనేది తండ్రిగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోందా!’ అని అడిగిన ప్రశ్నకు నాగ్.. ‘నాగ చైతన్య హ్యాపీగా ఉన్నాడు. నేను దాన్ని చూస్తున్నాను. నాకు అది చాలు. ఇప్పుడు మేం విడాకుల విషయం గురించి ఆలోచించటం లేదు. మా జీవితాల నుంచి విడాకుల అంశం వెళ్లిపోయింది. అలాగే అందరి జీవితాల్లో నుంచి వెళ్లిపోతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. అయితే విడాకుల తర్వాత సమంతపైనే ఎక్కువ విమర్శలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలు శ్రుతి మించటంపై కూడా సమంత ఫైర్ అయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం మాత్రం ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.