Nagarjuna: బుల్లితెర పై ప్రసారమయ్యే అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం వివిధ భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. అలాగే ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.
Nani
ఇక హిందీలో ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో నాగార్జున ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.ఇక మూడవ సీజర్ నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక నాగార్జున ఈ కార్యక్రమానికి మూడు నాలుగవ సీజన్లకు ఎంతో అద్భుతంగా హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఐదవ సీజన్ ముందుకు నడిపించడంలో నాగార్జున కాస్త విఫలమయ్యారని చెప్పాలి.ఈయన పలు సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఫాలో అవ్వడం లేదు.తద్వారా వారం రోజులపాటు ఏ కంటెస్టెంట్ ఎలా ప్రవర్తించారు ఎవరు ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చారు అనే విషయాన్ని గుర్తించలేదు.
Nagarjuna: బిగ్ బాస్ స్క్రిప్ట్ చదువుతున్న నాగార్జున..
ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ ద్వారా ఈయన వీకెండ్ కంటెస్టెంట్ల ముందుకు వచ్చి వారి తప్పు తెలుసుకోకుండా కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ కి ప్రోత్సహించడం పట్ల ఎంతోమంది నాగార్జున పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున నాగార్జునపై మండిపడుతున్నారు.అదేవిధంగా గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి రేటింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.వీకెండ్ టైంలో కూడా రేటింగ్ ఏ మాత్రం పుంజుకోకపోవడంతో నాగార్జున ప్రేక్షకులను సందడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తదుపరి సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే ఈ కార్యక్రమాన్ని చూసే వారి సంఖ్య మరింత తగ్గిపోతుందని ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోకపోతే బిగ్ బాస్ కార్యక్రమం మునుముందు కొనసాగడం కష్టతరమవుతుందని చెప్పాలి.