Bigg Boss 6 Telugu: శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో ముందుగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ హౌస్ లో రేవంత్ మీద కంప్లైంట్ ఉన్న వాళ్లు ఎవరెవరు ఉన్నారో లేచి నిలబడండి అని అంటాడు. ఎవరికి ఏ కంప్లైంట్స్ లేవా అని నాగార్జున అడుగుతాడు. సార్ కంప్లైంట్ అంటే పర్సనల్ గా ఏమీ లేవు టాస్క విషయంలో ఉందని రోహిత్ చెప్తాడు. దీంతో హౌస్ మెంట్స్ అభిప్రాయం చెప్పండి సంచాలకుడిగా రేవంత్ చేసింది కరెక్టా కదా అని నాగార్జున హౌస్ సభ్యులను అడుగుతాడు.
కరెక్ట్ సార్ అని ఆదిరెడ్డి అభిప్రాయపడతాడు. అంటే నీకు ఫేవరబుల్ గా ఉంది కాబట్టి అన్ని ఓకేనా అని నాగ్ అంటాడు. నాకు ఫెవరబుల్ గా లేదు సార్ అని ఆదిరెడ్డి సమాధానం ఇస్తాడు. రోహిత్ కి ఫెవరబుల్ గా డెసిషన్ లేదు అందుకు ఫిర్యాదు చేస్తున్నాడు… బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కి మాత్రం వ్యతిరేకంగా ఎప్పుడూ చేయకూడదు.. నీవు సంచాలక్ గా రూల్స్ మార్చావు కానీ కన్ఫ్యూజ్ అయ్యావని రేవంత్ కి నాగార్జున చెప్తాడు.

దీంతో అందరూ గేమ్ ఇంట్రస్టింగ్ ఆడటం లేదని రేవంత్ చెప్తాడు. అగ్రెసీవ్ అవ్వకూడదని నేను చెప్పలేదు..ఫిజికల్ గా అగ్రెసీవ్ అవ్వకూడదని చెప్పాను అంటాడు నాగ్. నేను ఫిజికల్ గా అవ్వకపోయినా… గేమ్ ఆడటం చేతకాక ఫిజికల్ అని చెప్తున్నారని రేవంత్ పేర్కొంటాడు. అది వాళ్ల స్టార్టజీ రేవంత్ అని నాగ్ చెప్తాడు. ఇక ఇనయ… నీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు మాటలు అలా వదిలేస్తావని నాగార్జున ప్రశ్నిస్తాడు.
ఆటలో ఓడిపోతే ఫ్రస్టేషన్ లో ఎఫ్ వర్డ్స్ వాడతావా.. నామినేషన్స్ లో నీవు ఫైమాని ఏమన్నావో తెలుసా.. ఫైమా ప్రోఫెషన్ ని చాలా పర్సనల్ గా మాట్లాడావని నా ఫీలింగ్.. అడల్ట్ కామెడీ స్టార్ అని అన్నావ్.. ఇది చాలా పర్సనల్ కమెంట్.. ఇనయ మేము నిన్ను ఏమనాలి చెప్పు అని ఇనయను నాగార్జున ప్రశ్నిస్తాడు. అక్కడితో ప్రోమో ముగుస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ రేవంత్ తో పాటు ఇనయకు కూడా నాగార్జున గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.