Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6.. వీకెండ్ రానే వచ్చింది. ఇక శనివారం షో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? పువ్వులేసే వారికి పువ్వులు.. అక్షింతలేసే వారికి అక్షింతలు వేస్తారు నాగ్. ఈ సారి అతికొద్ది మందికి తప్ప మిగిలిన వారందరికీ నవ్వుతూనే పంచ్‌లేశారు నాగార్జున. తగలవలిసిన వారికి బాగానే తగిలాయనుకోండి. గత వారం ఇనయ, శ్రీహాన్‌ల మధ్య ఏజ్ విషయమై గొడవ జరిగింది. నామినేషన్స్‌లో భాగంగా.. ఈ ఏజ్ మ్యాటర్ తీసి ఇనయ రచ్చ రచ్చ చేసింది.
శ్రీహాన్ తను ఏదో సందర్భంలో చిన్నోడిని అన్నాడని.. తనంత పెద్ద దాన్ని కాదని.. బాడీ షేమింగ్ చేశాడని రచ్చ రచ్చ చేసింది. ఈ విషయంలో నాగ్ పంచ్ శ్రీహాన్ కాస్త గట్టిగానే తగిలింది. ఇక సూర్య, ఆరోహిల గొడవ ఆది మెడకు చుట్టుకుంది. గత వారం సూర్య, ఆరోహి గొడవపడ్డారు. సూర్య తను తింటున్న అన్నాన్ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేశాడు. ఈ విషయంలో సూర్యపై చాలా నెగిటివిటీ వచ్చింది. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో ఫుడ్ సరిపోక ఎందరో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలీ చాలని ఫుడ్‌తో నానా తంటాలు పడుతున్నారు.
Bigg boss 6 : ఫుడ్ విషయంలో ఏ పనిష్మెంట్ ఇవ్వను..
అలాంటి సమయంలో సూర్య ఫుడ్ పడేయడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని పడేయడంపై.. అది కూడా ఆదిరెడ్డి, రేవంత్ వంటి వారు చాలీచాలని ఫుడ్‌తో కాలాన్ని వెళ్లదీస్తున్న సమయంలో పడేయడంపై సూర్యని బాగానే ఏకి పారేశారు. ఇక ఈ వారం ఈ విషయమై నాగ్ కూడా అటు సూర్యని.. ఇటు ఆదిరెడ్డికి ఫుల్‌గా క్లాస్ పీకారు. ఫుడ్ దొరక్క బయట ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? అన్నాన్ని పడేస్తావా? అంటూ నాగ్ సూర్యపై ఫైర్ అయ్యారు. గత వారం ఆదిరెడ్డి.. ఫుడ్ విషయంలో ఏ పనిష్మెంట్ ఇవ్వనని.. ఎందుకంటే అందరికీ తక్కువ ఫుడ్ ఉంది అని చెప్పాడు. ఈ విషయాన్ని నాగ్ గుర్తు చేస్తూ.. నాకు మా ఆడియన్స్‌కి ఇలాంటి కబుర్లన్నీ చెప్పావు. మరి సూర్య ఫుడ్ పడేస్తుంటే ఏం పీకావని ఆదిరెడ్డికి క్లాస్ పీకారు.