Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు దాదాపు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఆయన వారసులుగా నాగార్జునను ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు.ఇలా నాగార్జున బాలనటుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అనంతరం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ నవమన్మధుడుగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.
ఇలా మన్మధుడిగా ఇండస్ట్రీలో ఎంతోమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జునకు ఇప్పటికీ ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ ఈయనను మన్మధుడుగానే అమ్మాయిలు భావిస్తుంటారు. ఇండస్ట్రీలోకి నాగచైతన్య అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాగార్జునకున్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోని నాగార్జున తన కొడుకులకు పోటీగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సమయంలో తండ్రులు ఏదైనా సమాజానికి మంచి తెలియజేసే సినిమాలలో నటిస్తారు. కానీ నాగార్జున మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. నాగార్జున ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూనే కొడుకులకు పోటీగా రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
Nagarjuna: ది ఘోస్ట్ సినిమాతో భయపెట్టనున్న నాగ్…
ఇలా నాగార్జున ఇప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా ద్వారా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.