గత కొంతకాలంగా అటు బుల్లితెర ప్రేక్షకులను ఇటు వెండి తెర ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ముచ్చటగా మూడవసారి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.తన హోస్ట్ గా వ్యవహరించిన మొదటి రెండు సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తప్పు చేస్తే సీరియస్ అయ్యి వారికి క్లాసులు తీసుకునే నాగార్జున ఈసారి మాత్రం అడపాదడపా తప్ప పెద్దగా వాటి గురించి పట్టించుకోకుండా ఆ బాధ్యతను ప్రేక్షకులకు అప్పగించారు.దాంతో హౌస్ లో గందరగోళ వాతావరణం నెలకొంది.ముఖ్యంగా నిన్న జరగిన నామినేషన్స్ టాస్క్ లో ఇంటి సభ్యులందరూ కలిసి ఆడుతూ కొంతమంది ప్లేయర్స్ ను కార్నర్ చేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది.దీనిపై ఈవారం నాగార్జున సీరియస్ అయితే బాగుంటుందని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇవి అన్నీ ఎలా ఉన్న నాగార్జున మాత్రం తన మార్క్ యాంకరింగ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
తాజాగా నాగార్జున ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ లో కనిపించారు.అది ప్రేక్షకులకు బాగా నచ్చడంతో దాని ధర తెలుసుకోవడానికి ఆ షర్ట్ ను సెర్చ్ చేశారు.దాని ధర $1,110 యూఎస్ డాలర్స్ ఉండడంతో షాక్ అయ్యి ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.ఇది చూసిన అభిమానులు మన మన్మధుడి రేంజే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తో పాటు ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’ సినిమాలు షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.