Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్స్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు నాగచైతన్య సమంత. వీరిద్దరూ ఏ మాయ చేసావు సినిమా ద్వారా మొదటిసారి కలిసిన నటించారు. ఇలా ఈ సినిమాతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటమే కాకుండా ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా ఈ ఇద్దరు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇలా మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా విడాకులు తీసుకున్నటువంటి ఈ జంట వారి కెరియర్ పై ఎంతో దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన వీరు మాత్రం వీరి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయినప్పటికీ వీరు మాత్రం ఎంతో ఇష్టంగా వేయించుకున్న టాటూలను అలాగే ఉంచుకున్నారు. అలాగే కొన్ని గిఫ్ట్లను కూడా భద్రంగా దాచుకున్నారని తెలుస్తోంది.కానీ మరి కొందరు మాత్రం వీరి ఒకరి జ్ఞాపకాలను మరొకరు చెరిపేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Nagachaitanya: మొక్కలను ప్రేమగా చూసుకుంటున్న చైతూ
ఇదిలా ఉండగా నాగచైతన్య సమంత వివాహం తర్వాత వేరొక ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడ సమంత ఎంతో ప్రేమగా కొన్ని రకాల మొక్కలను పెంచుకునేదట. సమంత నాగచైతన్య దూరమైనప్పటికీ ఆ మొక్కలను సంరక్షించే బాధ్యత నాగచైతన్య తీసుకున్నారని సమంత తన పక్కన లేకపోయినా తను మాత్రం ఆ చెట్లు బాగోగులు చూసుకుంటూ వాటిని సంరక్షించే పనులు చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. సమంత లేకపోవడంతో చైతన్య ఆ మొక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట.