Nagababu : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కార్నివాల్.. వైభవంగా జరుగుతోంది. ఈ కార్నివాల్‌లో మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మెగాస్టార్ గురించి ఎవ్వరికీ తెలియని.. కనీసం చిరుకు సైతం గుర్తు లేని విషయం.. మీడియాకు సైతం తెలియని విషయాన్ని నాగబాబు చెప్పుకొచ్చారు. ‘‘మీ అందరికీ తెలియని విషయం, మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా గుర్తు లేని విషయం, ఇప్పటి వరకూ ఏ మీడియా సంస్థకూ తెలియని విషయం.. చాలా మంది వ్యక్తులకు తెలియని విషయం.. యంగ్‌స్టర్స్‌కి స్ఫూర్తిగా ఉంటుందని చెబుతున్నా. ‘21 సంవత్సరాల వయసున్న యువకుడు ఒక రూమ్ అద్దెకు తీసుకుని.. ముగ్గురు యువకులు సుధాకర్, హరిప్రసాద్, చిరంజీవిగారు కలిసుండేవారు. మాకెవరికీ ఆస్తులు లేవు. అక్రమ సంపాదన లేదు. కేవలం మా నాన్నగారు పంపించిన రూ.250లతో ఉండేవాడు. ఇక ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెబుతున్నా. వీళ్ల పక్కన పూర్ణ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది. పూర్ణ కామరాజ్ అనే పెద్దాయన ఉండేవారు. ఆయన మేనేజర్ సుబ్రహ్మణ్యంగారు. ఆయన కుమారుడు సూర్య అని ఉండేవాడు. ఆయన కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో పని చేశాడు. సూర్య చాలా కాలం అయింది చనిపోయి.
చిరు రూమ్ మేట్స్ అందరినీ.. సూర్య అమ్మగారు చాలా ప్రేమగా కుర్రవాళ్లు పాపం ఏం తింటారోనని.. కాఫీకి, టీకి పిలిచేవారు. అయితే వీళ్లేమో ఏదైనా సినిమా అవకాశం దొరుకుతుందేమోనని వెళ్లేవారు. సుబ్రహ్మణ్యం గారు ఒకానొక సినిమా.. ఆ సినిమాను చూసొచ్చి వాళ్లకు రివ్యూ ఇవ్వమని చెప్పి అఫీషియల్‌గా ప్రివ్యూ థియేటర్‌కి పంపించారు. వీళ్లను ముందు వరుసలో కూర్చొబెట్టారు. అయితే మేకప్ మెన్‌కు సీటు లేదని చెప్పి రెస్పక్టబుల్‌గా వీళ్ల ముగ్గురిని లేపి.. వాళ్లను కూర్చొబెట్టారు. వీళ్లను సైడ్‌కి నిలబెట్టారు. దీంతో వాళ్లు బయటకు వెళ్లలేక, థియేటర్‌లోనూ ఉండలేక కింద కూర్చోలేక.. సినిమా అయిపోయే వరకూ అలాగే నిలబడి చూసి ఆ తరువాత బయటకు వచ్చారు. ఆ తరువాత సుధాకర్, హరి ప్రసాద్.. సూర్య వాళ్ల ఇంటికి వెళ్లారు. ఆంటీ టిఫెన్, కాఫీ తరువాత చిరు గురించి అడిగితే వస్తున్నారని చెప్పారు. వెంటనే వాళ్లబ్బాయిని సూర్యను చిరు కోసం పంపించారు. సూర్య వచ్చి అమ్మ రమ్మన్నారని చెప్పారు. సరేనని వెళ్లారు.
Nagababu : వాళ్లంతా బలిసి కొట్టుకుంటున్నారు..
ఆంటీ సినిమా ఎలా ఉందని అడిగారు. బాగానే ఉందని చెప్పారు. ఏం అలా ఉన్నావని అడిగారు. అప్పుడు చిరు ‘ఆంటీ మీరు పంపారని వెళ్లాం. మాకేమీ ముందు వరుసలో కూర్చోవాలని లేదు. కానీ వాళ్లు మమ్మల్ని నిలబెట్టి వాళ్ల మేకప్ మెన్స్, డ్రైవర్లు, వాళ్ల మనుషులు, వాళ్ల పనోళ్లని కూర్చోబెట్టారు. మీ తరుఫున వెళ్లిన గెస్ట్‌లం కదా. కనీసం గౌరవం ఇవ్వలేదు. డోర్ దగ్గర నిలబెట్టారు. వాళ్లంతా బలిసి కొట్టుకుంటున్నారు ఆంటీ అన్నారు. ఆ హీరో గురించి ‘వాడెప్పుడూ అంతే’ అని ఆంటీ అన్నారు. కాదాంటి ఇదంతా అహకారం. చూడంటి ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబర్ 1 హీరో కాకుంటే నన్ను అడగండి’ అని ఆ రోజే అన్నాడు. ఈ విషయం సూరి నాకు చెప్పాడు. ఆ విషయం విని నాకు షాక్. ఈ విషయం చిరంజీవిగారికి గుర్తు లేదు. కానీ సినిమాల్లో నటించాలని వ్యక్తికి ఇలాంటి వెంజిల్స్ కూడా ఆయనకు తోడైతే ఎలా ఉంటుంది? చిరంజీవి కన్నా గొప్ప మోటివేటర్ ఎవరూ లేరు. ఆయన లైఫ్ కన్నా గొప్పి మోటివేషన్ ఎవరూ లేరు. దయచేసి ఆ హీరో ఎవరని అడక్కండి. ఆయనెవరో మీ అందరికీ తెలుసు’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.