Nagababu: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కార్నివాల్.. వైభవంగా జరుగుతోంది. ఈ కార్నివాల్లో మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన సినిమాల గురించి.. ముఖ్యంగా రాజకీయాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఏపీ ముఖ చిత్రాన్ని మార్చబోయేది వపన్ కల్యాణేనని పేర్కొన్నారు. అసలు తన తమ్ముడు తొలుత దర్శకుడిగా మారాలనుకున్నాడని కానీ చిరంజీవి సూచన మేరకు హీరోగా మారి పవర్ స్టార్ అయ్యాడంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
ఒక తమ్మున్ని నిలబెట్టి నిర్మాతగా జీవితాన్నిచ్చాడు అది నేను. మరో తమ్ముడు పవన్ కల్యాణ్.. ఎ వైబ్రేటెడ్ నేమ్. పవన్ నిరంతరం ఆలోచన.. ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నాడు. పవన్ దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు.. నువ్వు హీరోగానే మారాలని అన్నయ్య సూచించారు. దీంతో పవన్ అన్నయ్య మాటను అంగీకరించి పవర్ స్టార్‌గా మీ ముందుకొచ్చాడు. రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి.. ఏపీ ముఖ చిత్రాన్ని మార్చబోయే వ్యక్తి పవన్ కల్యాణ్. అంత గొప్ప నాయకుడిని దేశానికి కానుకగా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి.
Nagababu: కుళ్లిపోయిన రాజకీయాల మీద అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు
కుళ్లిపోయిన రాజకీయాల మీద అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు జనసేనాని. వ్యక్తిగా నేను కూడా అదే పార్టీలో ఉంటూ ఆయన కోసం నా భుజం కాస్తున్నా. అన్న కోసం నేను చేశాను. ఇప్పుడు తమ్ముడు కోసం చేయాలి.. చేస్తాను కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు జనసేనలో ఉంటా’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్‌ను ఆకాశానికి ఎత్తి జనసేనాని అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తారు. పవన్‌ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. తన అన్నని కానీ తమ్ముడిని కానీ ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తానని చెప్పుకొచ్చారు. దానికి తనను కాంట్రవర్షియల్ పర్సన్ అని అంటారని చెప్పుకొచ్చారు.