యంగ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 20న బెంగుళూరు వేదికగా అతని పెళ్లి జరగబోతుంది. ఇక పెళ్లి కార్డుతో ఈ విషయాన్ని అఫీషియల్ గా ధ్రువీకరించారు. ఇక నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష శెట్టి. ఈ అమ్మాయి కర్ణాటకకి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇక నాగ శౌర్య ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలియగానే గూగుల్ లో అతని అభిమానులు అనూష శెట్టి గురించి వెతకడం మొదలు పెట్టారు. అయితే అందరికి షాక్ ఇచ్చే విధంగా ఆమె ప్రొఫైల్ కనిపించింది. బెంగుళూరులో ఆమె సొంతంగా ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడుపుతుంది. ఆ కంపెనీని మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంది.
స్వతహాగాలో ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి బెంగుళూరులో కంపెనీ పెట్టి ఎన్నో హోసింగ్ ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యింది. దేశంలోనే ప్రముఖ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలలో ఒకటిగా తన సంస్థని నిలబెట్టింది. అలాగే ఆమె యంగ్ విమెన్ ఎంటర్ప్రయినర్ గా అవార్డులని కూడా సొంతం చేసుకుంది. బిజినెస్ మ్యాగజైన్స్ లో కూడా ఆమె కవర్ ఫోటోతో ఆర్టికల్స్ ప్రచురించాయి. 2019లో డిజైనర్ అఫ్ ది ఇయర్, 2020లో అండర్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో చోటు, 2020లో మోస్ట్ ఇన్నోవేటివ్ లగ్జరీ డిజైనర్, 2021లో ఇండియా టాప్ 10 డిజైనర్స్ లో చోటు దక్కించుకుంది.
మహిళ వ్యాపారవేత్తగా ఆమె ఇండియాలోనే ప్రముఖమైన స్థానంలో ఉంది. అలాంటి అమ్మాయిని నాగశౌర్య ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బంధువులు అమ్మాయి అనే టాక్ ముందుగా వచ్చిన అలాంటిదేం కాదని తెలుస్తుంది. నాగశౌర్య తెలంగాణ కాగ అనూషని బెంగుళూరు ఇద్దరి ప్రాంతాలు వేరు, అలాగే కులాలు కూడా వేరు కావడం విశేషం. అయితే తారక్ తల్లి సొంత ఊరు అనూష శెట్టి ఊరు ఒకటే కావడం విశేషం.
ఈ నేపధ్యంలో అనూష శెట్టితో మ్యాచ్ ని ఎన్టీఆర్ తల్లి చూసి ఉంటుందనే మాట వినిపిస్తుంది. లేదంటే నాగ శౌర్య, అనూష శెట్టి ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే అఫీషియల్ గా వారి మ్యాచ్ ఎలా సెట్ అయ్యింది అనేది వారు చెబితేనే తెలుస్తుంది. ఇక అనూష శెట్టి మంచి ఫైనాన్నియల్ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి కావడంతో నాగ శౌర్యకి హీరోగా కెరియర్ లి ఎలాంటి ఢోకా ఉండదనే మాట వినిపిస్తుంది.