Naga Shaurya: టాలీవుడ్‌లో మరో యువ హీరో ఓ ఇంటివాడయ్యాడు. యువ కథానాయకుడు నాగశౌర్య వివాహం వైభవంగా జరిగింది. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నాగశైర్య పెళ్లాడాడు. బెంగళూరు నగరంలోని ఓ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ముందే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఇదే హోటల్‌లో జరగడం విశేషం.
ఆదివారం ఉదయం ముహూర్త సమయం 11:25 గంటలకు అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు నాగశౌర్య. ఈ వివాహ వేడుక ఔట్-డోర్‌లో జరగడం విశేషం. పెళ్లి మండపాన్ని పలు రకాల పువ్వులతో అలంకరించారు. మంచి కలర్‌ఫుల్ ఫ్రేమ్ చూసినట్లు అనిపించింది అందరికీ. నాగశైర్య, అనూష శెట్టి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిథులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
మరోవైపు నాగశౌర్య పెళ్లి సందర్భంగా వరుడు తెలుగు సంప్రదాయం ప్రకారం పంచకట్టుతో యువరాజులా దర్శనమిచ్చాడు. పెళ్లి కుమార్తె కూడా రెడ్, గోల్డ్ కలర్ పట్టుచీరలో పెళ్లి పీటలపైకి వచ్చింది. కాస్ట్‌లీ డైమండ్ సెట్ వేసుకొని అచ్చం రాకుమారిలా కనిపించిందంటూ చూపరులు చెప్పుకున్నారు. వీరి పెళ్లి సందర్భంగా తీసిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Naga Shaurya
ఘుమఘుమలాడే వంటలు.. అదిరిపోయే టేస్టు
నాగశౌర్య వివాహం సందర్భంగా విచ్చేసిన అతిథులకు వివాహ విందు ఘనంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. స్టార్ హోటల్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం బంతి భోజనాలు ఏర్పాటు చేశారు.అయితే, ఒక్కో అతిథికి ఒక్కో టేబుల్ వేశారు. ఈ టేబుల్స్ కూడా అష్టభుజ ఆకారంలో సరికొత్తగా ఉండటం విశేషం. రకరకాల పసందైన వంటకాలతో అతిథులకు వడ్డించారు. వడ్డన చేసే వారు కూడా పంచె కట్టుతో గౌరవ మర్యాదలు ఇచ్చారు. విందులో 12 రకాల వంటకాలు, 4 రకాల స్వీట్లు ఉన్నాయి.
@IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE
— devipriya (@sairaaj44) November 20, 2022