Naga Shourya: టాలీవుడ్ ఇండస్ట్రీలో “ఊహలు గుసగుసలాడే” సినిమాతో హిట్ అందుకున్న నాగశౌర్య అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. జయపజయాలతో సంబంధం లేకుండా.. ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ ఒకపక్క యూత్ మరోపక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నాడు. ప్రజెంట్ “కృష్ణ వ్రింద విహారి”తో నేడు ప్రేక్షకులను పలకరించడం జరిగింది. ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వినూత్నంగా జరిగాయి. తిరుపతి నుండి నాగశౌర్య పాదయాత్ర స్టార్ట్ చేసి అభిమానులను పలకరిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఒక తిరుపతిలో మాత్రమే కాదు నెల్లూరు, గుంటూరు, ఏలూరు, విజయవాడ, భీమవరం పంటిచోట్ల కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో నాగశౌర్య ఒకరు.
సినిమాలో పెళ్లి తర్వాత రొమాన్స్ ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పటంతో.. మీ పెళ్ళెప్పుడు అని.. విలేఖరి ప్రశ్నించారు. చాలావరకు ఈ ఏడాది చివరిలో నా పెళ్లి ఉండొచ్చు. తెలుగు వచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాను.. అంటూ హిట్ ఇచ్చాడు. దీంతో నిర్మాత ఉష వాళ్ళ అమ్మగారు కావడంతో వాళ్ల బంధువులలోనే.. ఆ అమ్మాయి ఉండి ఉండొచ్చు అంటూ టాక్ నడుస్తోంది. నాగశౌర్య సొంత ఊరు విజయవాడ కావటంతో కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలున్నట్లు అందరూ భావిస్తున్నారు.