నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కస్టడీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అని తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ బట్టి అర్ధమవుతుంది. ఇక ఈ మూవీ తర్వాత నాగ చైతన్య పరశురాం దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఎప్పుడో కన్ఫర్మ్ అయినా కూడా ఏవో కారణాల వలన ఇంకా స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ ని పరశురాం కంప్లీట్ చేసాడని టాక్ వినిపిస్తుంది.
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఓ బ్రిడ్జ్ నిర్మాణం నేపధ్యంలో కథని పరశురాం సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇక ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే ఇంజనీర్ పాత్రలో నాగ చైతన్య క్యారెక్టర్ ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ కథని 90 బ్యాక్ డ్రాప్ లో పరశురాం సిద్ధం చేసాడనే మాట వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా చైతూని కలిసి దర్శకుడు స్టొరీని నేరేట్ చేసాడని, కథ కూడా అద్బుతంగా ఉండటంతో చైతూ వెంటనే ఒకే చెప్పాడని టాక్. ఇక ఈ మూవీన్ని వీలైనంత వేగంగా స్టార్ట్ చేయాలని చైతూ, పరశురాం అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే విధంగా ఈ మూవీని ఆవిష్కరించేందుకు పరశురాం సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. దీని తర్వాత బాలకృష్ణ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం సినిమా ఉండనుంది.