మజిలీ, లవ్ స్టోరీ సినిమాల తర్వాత నాగ చైతన్య నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం థాంక్యూ. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక బాలీవుడ్ అరంగేట్రం చేసిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా చైతూకి నిరాశనే మిగిల్చింది. ఈ నేపధ్యంలో కాస్తా కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో సౌత్ లో విభిన్న చిత్రాల దర్శకుడుగా పేరున్న వెంకట్ ప్రభుతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక దీనితో పారు పరశురామ్ దర్శకత్వంలో నాగ చైతన్య మూవీ చేయబోతున్నాడు.
అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా చైతూ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో మరో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో రైటర్ గా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారిన టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగులతో జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా వేణు ఊడుగుల చైతన్యకి మంచి ఫీల్ గుడ్ స్టోరీని నేరేట్ చేసాడని కథ నచ్చడంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వేణు ఊడుగుల రీసెంట్ గా రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో విరాటపర్వం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా హిట్ కాకున్నా మంచి చిత్రం అనే టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలోనే రానా రిఫరెన్స్ తో చైతూ వేణు ఊడుగుల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు బోగట్టా. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవిని చైతూకి జోడీగా తీసుకోవడానికి వేణు ఊడుగుల ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక సాయి పల్లవి చైతూతో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇద్దరికి మంచి హిట్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మరోసారి ఈ కాంబోపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.