Naga Chaitanya: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన సినిమాలు కూడా వరుసగా విడుదలైనప్పటికీ ఈయనకి పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు.ఇక గత ఏడాది ఈయన నటించిన లవ్ స్టోరీ అలాగే ఈ ఏడాది మొదట్లో విడుదలైన బంగార్రాజు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అనంతరం నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నాగచైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా లవ్ స్టోరీ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.లవ్ స్టోరీ అంటే సమంతతో నాగచైతన్య జరిపిన లవ్ స్టోరీ కాదు ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా గురించి ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ విడుదలైంది.
ఈ సినిమా విడుదలై నేటికీ సంవత్సరం పూర్తి కావడంతో ఈ సినిమా గురించి నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని నాకు అందించిన చిత్ర బృందానికి ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. లవ్ స్టోరీ సినిమా నా జీవితంలో ఎన్నో విషయాలను నాకు నేర్పింది. ఈ సినిమా జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Naga Chaitanya: లవ్ స్టోరీ సినిమా ఎన్నో విషయాలు నేర్పింది..
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అని చెప్పాలి.కరోనా రెండవ దశ తర్వాత విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించింది.ఇలా కరోనా తర్వాత థియేటర్లలో విడుదల అయ్యి భారీ హిట్ సాధించడంతో మరెన్నో సినిమాలు కూడా ఎంతో ధైర్యంగా థియేటర్లో విడుదలయ్యాయి.ఇక నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.