నాంది మూవీతో అల్లరి నరేష్ కు కెరియర్ లో బెస్ట్ హిట్ ను అందించిన విజయ కనకమేడలతో నెక్స్ట్ నాగచైతన్య ఒక మూవీ చేయాల్సివుంది కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందని సమాచారం.నాంది మూవీ తర్వాత కలిసి పని చేయలకున్న నాగచైతన్య,విజయ కనకమేడల స్టోరీ పరంగా ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు.దీంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి ఇరువురు వచ్చారట.
ప్రస్తుతం నాగ చైతన్య థాంక్ యూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ మూవీ అనంతరం నాగ చైతన్య నందిని రెడ్డి లేదా మోహన కృష్ణ ఇంద్రగంటితో మూవీ చేసే ప్లాన్ లో ఉన్నారని సమాచారం.