Naga chaitanya: అక్కినేని వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ‘జోష్’ సినిమాతో అడుగు పెట్టిన హీరో అక్కినేని నాగచైతన్య. వాసు వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘జోష్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. మంచి కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను నిలకడగా కొనసాగిస్తున్నాడు. ‘ఏమాయచేసావే’, ‘100% లవ్’ తో హిట్లు కొట్టిన నాగచైతన్య.. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును పొందాడు.
తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగచైతన్య.. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ ఛడ్డా’ సినిమాలో నటించాడు. తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి ఎ‘బంగార్రాజు’ చేసిన నాగచైతన్య.. కొత్త సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం.
ఈ సినిమాకు ఇళయరాజా కొడుకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండటం, తమిళ హీరో జీవా విలన్ గా నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు చై సినిమా మీద అంచనాలను పెంచేసింది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో జరగగా.. అక్కడ ఓ గుడి పక్కనే బార్ సెట్ వేయడంతో, గ్రామస్తులు షూటింగ్ కు అడ్డుపడటంతో పాటు దాడికి దిగడం వార్తల్లో నిలిచింది.
Naga chaitanya:
ఇక తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్ సినిమా మీద అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియామణి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియామణి ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గత సినిమాలతో పోలిస్తే.. నాగచైతన్య సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతోంది.