అక్కినేని హీరో నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్లతో డేట్ లో ఉన్నాడనే కామెంట్స్ వినిపించాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, ఈ కారణంగానే నాగచైతన్య, సమంత మధ్య దూరం పెరిగి విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం నడిచింది. అయితే ఆ సమయంలో శోభిత దూళిపాళ్ల ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. నాగ చైతన్యతో తనకి ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది. అప్పటికి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతూ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల కలిసి ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే కలిసి ఫారిన్ వెకేషన్ కి ఎందుకు వెళ్లారు అంటూ కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవి అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా విమర్శలు చేస్తున్న వారికి రీకౌంటర్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు అనడానికి ఆ ఫోటోనే సాక్ష్యం అంటూ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. అయితే నాగ చైతన్య, శోబిత ఇద్దరూ లవ్ లో ఉన్నారు అని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం చైతూ స్పందించాల్సిందే అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. కాని చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపధ్యంలో తనపై జరుగుతున్న ప్రచారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టె ఛాన్స్ అయితే లేదనే మాట వినిపిస్తుంది.