Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 రెండో వారం దాదాపు పూర్తైపోయినట్టే. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్కులు అవగానే ఇక ఆ తరువాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేది శనివారం కోసం. అదేనండి మన హోస్ట్ నాగార్జున వస్తారు కదా. ఎవరెవరికి అక్షింతలు వేస్తారో.. ఎవరెవరికి పూలు ఇస్తారోనని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక శనివారం రానే వచ్చింది. తప్పొప్పుల చిట్టా ఇప్పేసి ఇవ్వవలిసిన వారికి ఇచ్చేసి.. ప్రశంసించవలిసిన వాళ్లను ప్రశంసించే ప్రోగ్రామ్ ఈరోజే ఉంటుంది. కాబట్టి ప్రోమో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.
లేటుగా అయినా లేటెస్ట్‌గా ప్రోమోను వదిలింది స్టార్ మా. గుంటూరు మిర్చి కారం తిని వచ్చారో ఏమో కానీ నాగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోయారు. అక్షింతలు మామూలుగా వెయ్యలేదు. ఒక్కొక్కరికీ నెత్తి పగిలేలా వేశారు. మొత్తానికి గేమ్ ఆడని వారి దుమ్ము దులిపేశారు. ఒక్కొక్కరినీ హోస్ట్ నాగార్జున ఏకి పారేశారు. మన పొట్టి డ్రెస్సుల పాప శ్రీ సత్యకు బాగా గట్టిగానే ఇచ్చారు. అమ్మడు రేపు తినకున్నా సరిపోయేంత ఇచ్చారు. సుష్టుగా తినేసి కబుర్లు చెప్పుకుంటూ.. హితబోధలు చేసుకుంటూ ఈ ముద్దుగుమ్మ హౌస్‌లో టైం పాస్ చేస్తూ ఉంటుంది.
Biggboss 6 : ప్లేటు లాగేసుకుని ఉంటే డెఫినెట్‌గా ఫీలయ్యేదానివి..
టాస్క్‌లను అస్సలు సీరియస్‌గా తీసుకోదు. ఇప్పటి వరకూ ఒక్క టాస్క్ అంటే ఒక్కటి కూడా ఆడిన పాపాన పోలేదు. అమ్మడిని బయట బాగానే ట్రోల్ చేస్తున్నారు. ఇక తిని కూర్చొని కబుర్లు చెబుతా అంటే నాగ్ ఊరుకుంటారా? ఉతికి ఆరేయరూ. అందుకే ఇవాళ చాకిరేవు పెట్టేశారు. బాలాదిత్య, షానీ, సుదీప, శ్రీ సత్య, వాసంతి, మరీనా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్..ఈ తొమ్మిది మంది చిల్ అవడానికి వచ్చారంటూ గట్టిగానే ఇచ్చారు. ఇక శ్రీసత్య.. ‘నీ బొమ్మ వెళ్లిపోయిందని నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే డెఫినెట్‌గా ఫీలయ్యేదానివి’ అంటూ అమ్మడికి మాడు పగిలేలా కోటింగ్ ఇచ్చారు నాగ్. పాపకు సౌండ్ లేదు.