Bigboss 6: ఈ వీకెండ్‌లో బిగ్‌బాస్ సీజన్ 6 దద్దరిల్లిపోయింది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరినీ ఫుల్లుగా క్లాస్ పీకారు. ఆదిరెడ్డి విషయానికి వస్తే.. ఆట మధ్యలో కూడా రివ్యూలేనా? అది మానేస్తే ఆట బాగా ఉంటుంది అని అన్నారు నాగ్. వీళ్ల గురించి మాట్లాడటానికి ఏమైనా ఉంది.. మీ తొమ్మిది మంది గురించి మాట్లాడటానికి ఏమీ లేదంటూ పరువుతీశారు. కీర్తి.. నీకు ఆడే స్పిరిట్ లేదా?. లైఫ్ అనేది నిన్ను సరిగ్గా చూడలేదు.. అన్ని మరిచిపోయి ఇక్కడ ఆడితే.. లైఫ్‌ను గెలుచుకుంటావ్.. జీవితం నీకు ఒక ఛాన్స్ వచ్చింది.. ఇంపాజిబుల్ చాన్స్ వచ్చింది. నువ్ ఈ వారం ఏమీ ఆడలేదని అక్షింతలేశారు.
శ్రీ సత్య.. నీపేరులో సత్య ఉంది.. నీలో సత్యం ఉందా?.. ఫుడ్ మీదున్న దృష్టి.. ఆట మీద లేదు.. ఆడి కెప్టెన్ అయి.. బ్యాడ్ కెప్టెన్ అవ్వకుండా ఉంటే బాగుంటుందా? అంటూ చీవాట్లు పెట్టాడు. బొమ్మ పోయిందని బాధపడలేదు.. ప్లేట్ తీసుకుంటే బాధపడేదానివి.. ఇక్కడకు వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు. ఆడలేదని ఒప్పుకుంటున్నావ్.. అదే సంతోషం.. అని సెటైర్లు వేశారు.
Bigboss 6: మీరంతా బోరింగ్‌గా తయారయ్యారు.. మీ ఆట వేస్ట్..
మెరినా రోహిత్. పవర్ ఆఫ్ టూ కింద వచ్చారు.. పర్ఫామెన్స్ మైనస్ 2, జీరో.. ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ ఉందని ఆదిరెడ్డి నామినేట్ చేశాడు.. కానీ అక్కడ అంత సీన్ లేదు.. కిస్, హగ్గులు ఇవ్వలేదని ఫిర్యాదు చేశావ్ మెరినా.. ఆట ఆడకపోతే.. కంప్లైంట్ చేయలేదు ఎందుకు అంటూ పరువుతీశాడు. హక్కుల గురించి మాట్లాడావ్?.. బాధ్యతల గురించి మాట్లాడలేదు.. బాధ్యతలు అంటే.. జనాలను ఎంటర్టైన్ చేయడానికి, ఆట ఆడటానికి వచ్చారు. కానీ మీరంతా బోరింగ్‌గా తయారయ్యారు.. మీ ఆట వేస్ట్.. అని గాలితీసేశాడు.