Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసిన నాందెండ్ల భాస్కర్ రావు తరచూ ఇంటర్వ్యూలతో సంచలన విషయాలు బయట పెడుతూ ఉంటారు. రాజకీయాల్లో ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినప్పటికీ రాజకీయాల్లో జరిగే పరిణామాలు నిత్యం నిశితంగా పరిశీలిస్తుంటారాయన. ఇప్పటికీ రాజకీయాలు మస్ట్ ఫాలో అవుతుంటారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరికొత్త అంశాలు ప్రజలకు వెల్లడించారు.
ఆయనతో నాది తండ్రీ కొడుకుల బంధం
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన మరో ఉద్ధండుడు మర్రి చెన్నారెడ్డి. ఆయనకు, తనకు తండ్రీ కొడుకుల సంబంధం అని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. అయితే, ఇందిరా గాంధీకి మర్రి చెన్నారెడ్డిపై సదభిప్రాయం ఉండేది కాదన్నారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ రెడ్డి గారి పౌరుషం, ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించే వారన్నారు. ఓ సారి సూర్యాపేట వెళ్లినప్పుడు విచిత్ర ఘటన జరిగిందన్నారు. అక్కడ బస చేసిన క్రమంలో ఇందిరా గాంధీని తీసుకెళ్లామన్నారు. అయితే, కార్యక్రమానికి వెళ్లేటప్పుడు మొదట ఇందిరానే కారు వద్దకు చేరుకున్నారని, ఎంతసేపయినా మర్రి చెన్నారెడ్డి గది నుంచి బయటకు రాలేదన్నారు.
ఆ సమయంలోనే ఎమ్మెల్యేలంతా మర్రి చెన్నారెడ్డి కాళ్ల మీద పడుతూ ఇందిరకు కనిపించారట. ఇది సరైంది కాదని చెబుదామనుకున్నా గానీ.. ఇద్దరూ పెద్ద వారు.. వారికి చెప్పేంత వాడిని కాదని మిన్నకుండిపోయానని చెప్పారు నాదెండ్ల. అప్పటి నుంచి మర్రి చెన్నారెడ్డికి ఇందిరాగాంధీ కొంచం కొంచం దూరంగా మెలగడం మొదలు పెట్టారని వెల్లడించారు. మంత్రివర్గం కూర్పు సమయంలోనూ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
Nadendla Bhaskar Rao: మర్రి చెన్నారెడ్డి రాంగ్ స్టెప్ తీసుకున్నారు.. అది బ్లండర్
తనకు, మర్రి చెన్నారెడ్డికి మంచి అనుబంధం ఉన్నా.. ఆయన ఓ రాంగ్ స్టెప్ తీసుకున్నాడని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. మనల్ని ఇందిరా గాంధీ ఉండనివ్వదు.. తీసేస్తుంది.. మనం రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లందరినీ తీసేసుకుందాం.. మన బలాన్ని మనం పెంచుకుందాం.. రాజశేఖర్ రెడ్డిని మాత్రం తీసుకోవద్దు.. అని చెప్పారని నాదెండ్ల తెలిపారు. ఇది చాలా బ్లండర్ ఆఫ్ బ్లండర్ గా నిలిచిపోయిందని చెప్పారు. ఇలా వచ్చిన వాళ్లే మర్ని చెన్నారెడ్డిగారి పతనానికి కారణమయ్యారని చెప్పారు. పీవీ నరసింహారావుకు ప్రధాని పదవి కంటే పెద్దది అప్పజెప్పినా ఆయనకు స్టేట్ చీఫ్ మినిస్టర్ గా అవ్వడమే ఇష్టమని.. ఆ కోరికతో ఎవర్నీ ఇక్కడ పని చేయనీయకుండా పుల్లలు పెట్టేవాడని నాదెండ్ల తెలిపారు.