నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నభా నటేష్. ఈ అమ్మడు ముందుగా కన్నడనాట హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తరువాత తెలుగులోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది.
సుదీర్ బాబుకి జోడీగా నటించిన ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీతో క్రేజీ హీరోయిన్ గా నభా నటేష్ మారిపోయింది.
ఇక తరువాత వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు అయితే ఈ బ్యూటీకి లేవు. కాని అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ళ మతిపోగోడుతుంది.
ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ స్టైల్ లో హాట్ స్టిల్ తో మెస్మరైజ్ చేసింది. నడుము అందాలు చూపిస్తూ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్, లెహంగాతో ఉన్న ఆమె స్టిల్స్ ఆకట్టుకున్నాయి. నాభి అందాలు చూపిస్తూ ఈ ఫోటోలలో కుర్రాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాలలో అవకాశాల కోసం విపరీతంగా ట్రై చేస్తుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఆమె అందాల ప్రదర్శన చూసిన తర్వాత అయిన దర్శకులు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.