N Chandrababu Naidu : తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకి ఇటీవల విదేశాలలో అరుదైన గౌరవ దక్కిన సంగతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వార్తలను ఓ ఇంగ్లీష్ ఛానల్ కవర్ చేస్తూ లిరిసిస్ట్ చంద్రబోస్‌తో ముచ్చటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ఇంగ్లీష్ ఛానల్‌లోని న్యూస్ ప్రజెంటర్ చంద్రబోస్‌తో తెలుగులో మాట్లాడటం ఎంతో ఆసక్తికరం.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఇప్పుడు దీనికి సంబధించి ఏపీ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్‌లో ఆయన “చంద్రబోస్ గారి పాట…దానిపై ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తెలుగులో అక్షిత మాట…అద్భుతం, అభినందనీయం”..అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అంతటా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
కాగా, మన దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాక రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ నేపథ్యంలో మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి ‘బాహుబలి సిరీస్ తరువాత మరో సారి తెలిసింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాం చరణ్, కొమురం భీం గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.