కొంత మంది అమ్మాయిలు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతారు. ఎక్కడో, ఏదో రూపంలో వారు పార్టిసిపేట్ చేయడం ఆ ఫోటోలని ఎవరో ఒక కెమెరామెన్ చూసి ఇంటరెస్టింగ్ గా అనిపించడంతో షూట్ చేయడం, ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారడం జరుగుతుంది. ఇలాంటి ఫోటోలతో ఆ అమ్మాయిలు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవడం, సెలబ్రిటీలుగా మారిపోవడం జరుగుతుంది. అలాగే వారి గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా వెతికేస్తూ ఉంటారు.
ఇప్పుడు అలా ఓ అమ్మాయి కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా వెతకడం మొదలు పెట్టారు. ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఇండియా, అఫానిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అందమైన అమ్మాయి కెమెరా కంటికి చిక్కింది. ఆఫ్ఘానిస్తాన్ జెండా పట్టుకొని అదిరిపోయే స్మైల్ తో కనిపించిన ఈ బ్యూటీ తన స్మైల్ తో అందరికి ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈబ్యూటీ మిస్టరీ గర్ల్ గా మారిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈమె పేరు వాజమ్ అయుబి. ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన ఈ బ్యూటీ వ్యాపారవేత్తగా కెరియర్ ఎంచుకొని దుబాయ్ లో అడిగుపెట్టింది. అక్కడ ఒక ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి లమన్ క్లాతింగ్ అనే సంస్థని స్టార్ట్ చేసి తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక ఈమెకి క్రికెట్ మీద ఉన్న ఇష్టం ఆపై తన మాతృదేశం, అలాగే తన ఫేవరేట్ కంట్రీ పోటీ పడుతుండటంతో స్టేడియంలో ప్రత్యక్షం అయ్యింది. అక్కడ కెమెరాలకి చిక్కి పాపులర్ అయ్యిపోయింది. ట్విట్టర్ లో ఆమెకి ఈ ఒక్క ఫోటోతో చాలా మంది ఫలోవర్స్ గా మారిపోయారు.