గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి టాక్సీవాలాతో హిట్ వచ్చింది. అయితే అదే సమయంలో నోటా సినిమాతో డిజాస్టర్ తగిలింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా మీద విజయ్ ఎన్నో హోప్స్ పెట్టుకొని దగ్గరుండి ప్రమోట్ చేశాడు. అయితే సినిమా పెద్దగా ఎవరికి నచ్చలేదు. తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యి ప్రొడ్యూసర్ ని నిలువునా ముంచింది. ఇక తాజాగా లైగర్ సినిమాతో అయితే కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూరి మీద గుడ్డినమ్మకంతో సినిమా చేసిన విజయ్ దేవరకొండ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో తాను పాన్ ఇండియా స్టార్ గామారిపోతానని కలలు కన్నాడు. అయితే లైగర్ ఫ్లాప్ అతని కలలని నిలువునా కూల్చేసింది. లైగర్ సినిమా ఫెయిల్యూర్ లో విజయ్ దేవరకొండ పాత్ర లేదని చెప్పాలి. ఇది పూర్తిగా డైరెక్టర్ పూరి ఫెయిల్యూర్ అని మాత్రమే అందరూ చెబుతున్న మాట. అయితే లైగర్ సినిమా రిలీజ్ కాకుండానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగింది. మహేష్ బాబుతో చేద్దామని అనుకున్న కథని విజయ్ దేవరకొండకి తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లు పూరి కూడా చెప్పారు. ఇక ఈ సినిమాతో రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మైహోమ్ ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది.
భారీ కాన్వాయ్ తో సినిమా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాలని వారు ప్లాన్ చేసుకొని పూరి, విజయ్ కాంబినేషన్ పై పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే జనగణమన సినిమా కోసం 20 కోట్ల వరకు ఖర్చు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా పూరి జగన్నాథ్, మైహోమ్ అధినేతల మధ్య జరిగిన చర్చల అనంతరం వారు సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పూరి జగన్నాథ్ మరో ప్రొడ్యూసర్ వేటలో పడ్డట్లు తెలుస్తుంది. మొత్తానికి విజయ్ దేవరకొండకి గత కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాప్ లు పలకరించడంతో పాటు ఇలా ప్రొడ్యూసర్స్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో బ్యాడ్ టైం నడుస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు.