సీతారామం సినిమాతో ఇండియన్ వైడ్ గా సీతగా అందరికి చేరువ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ సీరియల్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక నటిగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకునే స్థాయిలో సీత పాత్రలో ఆమె పెర్ఫార్మెన్స్ ఉంది. ఇక నార్త్ ఇండియాకి చెందిన ఈ బ్యూటీ కెరియర్ ఆరంభంలో చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నట్లు తాజాగా చెప్పింది. లైఫ్ లో ఏం చేయాలి అనే విషయంలో ఒక స్పష్టత రావడానికి చాలా సమయం పట్టిందని ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
జర్నలిజం వైపు వెళ్దామని అనుకున్నా అని అయితే అనుకోకుండా మోడలింగ్ లోకి అడుగుపెట్టానని చెప్పింది. అక్కడ నుంచి నటిగా సీరియల్స్ లో కెరియర్ స్టార్ట్ చేశానని, అయితే ఆరంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని మృణాల్ చెప్పడం విశేషం. తన రూపం చూసి సైడ్ క్యారెక్టర్స్ కి కూడా పనికిరానని చాలా మంది విమర్శలు చేశారని చెప్పింది. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడికి గురై కొద్ది రోజులు చాలా ఇబ్బందులు పడ్డానని, ఆ సమయంలో వెళ్తున్న ట్రైన్ లొంచి దూకి చనిపోవాలని అనిపించేది అని చెప్పింది. అయితే నేనుచనిపోతే నా తల్లిదండ్రులు ఒంటరి అయిపోతారని భయం వేసి మళ్ళీ ఆ ఆలోచనలు కంట్రోల్ చేసుకునేదానిని అని చెప్పింది.
అలాగే కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని చెప్పింది. ఓ సినిమాలో తన మొదటి సినిమాలో నటించిన వేశ్య పాత్రని అర్ధం చేసుకోవడానికి రెండు నెలలు నిజమైన వేశ్యాగృహంలో ఉన్నానని, ఆ సమయంలో వారి కష్టాలు దగ్గర నుంచి నుంచి చూడటంతో తన మొదటి సినిమాలో మొదటి డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పి ప్రశంసలు అందుకున్నా అని చెప్పింది. అలాగే సాహిద్ కపూర్ ఫోటోలు టెక్స్ట్ బుక్స్ లో పెట్టుకునే అభిమానించే కాలేజీ డేస్ నుంచి ఆయానతో హీరోయిన్ గా నటించే స్టేజ్ వరకు అంతా ఓ అద్భుతమని చెప్పింది. ఇలా తన లైఫ్ లో కష్టాలు, కన్నీళ్లు, ఆవేదనలు అన్ని ఉన్నాయని మృణాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని కూడా సూచించింది.