సీతారామం సినిమాతో ఒక్కసారిగా సౌత్ లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రజల హృదయాలలో సీతగా ముద్ర వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకి నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే అవ్వుతుంది. ఇదిలా ఉంటే సీతారామం తర్వాత మళ్ళీ తెలుగులో హిట్ పడాలంటే ఆ స్థాయి పాత్ర ఉండాలని మృణాల్ ఠాకూర్ భావిస్తుంది. అందుకే కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.ఈ కారణంగానే సీతారామం తరువాత ఇప్పటి వరకు మృణాల్ మరో సినిమా.ఒప్పుకోలేదు కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారనే మాట వినిపిస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రెండో సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.
తెలుస్తుంది. అది కూడా మరో టాలెంటెడ్ యాక్టర్ తో జోడీగా ఆమె నటించబోతుంది. నేచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువ అయిన నానితో మృణాల్ ఠాకూర్ జత కట్టబోతుందని తెలుస్తుంది. నాని రీసెంట్ గా కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా అయినట్లు తెలుస్తుంది. అఫీషియల్ గా హీరోయిన్ పేరు అనౌన్స్ చేయలేదు.
అయితే ఈ సినిమా ఎనౌన్స్మేంట్ రోజునే మొత్తం క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని దసరా అనే సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మరో వైపు మృణాల్ ఠాకూర్ హిందీ సినిమాలు చేస్తుంది. ఆమె చేతిలో హిందీలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే వాటిని కంప్లీట్ చేసి సౌత్ పై ఫోకస్ పెట్టాలని మృణాల్ ఠాకూర్ భావిస్తుంది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరంలో అదిరిపోయే ప్రాజెక్ట్ తో రావాలని భావిస్తుంది.
Advertisement