మృణాల్ ఠాకూర్.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ బాలీవుడ్ లో కూడా ఈ మధ్యనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ తో కెరియర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ తరువాత హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. జెర్సీ రీమేక్ తో హిందీ ప్రేక్షకులకి చేరువ అయినా ఈ అమ్మడు సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. దీంతో టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు ఈ అమ్మడుకి క్యూ కడుతున్నాయి.
మొదటి సినిమాతోనే నటిగా కూడా మంచి మార్కులు సొంతం చేసుకోవడంతో ఫీమేల్ సెంట్రిక్ కథలు కూడా టాలీవుడ్ లో ఆమెతో చేయడానికి చాలా మంది రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత ప్లేస్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం ముందుగా నందిని రెడ్డి సమంతని హీరోయిన్ గా ఫైనల్ చేసుకుంది. ఆమె కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం సమంత చేతిలో యశోద, శాకుంతలం సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్స్, అలాగే హిందీలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. దీంతో ఇప్పట్లో నందిని రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో నందిని రెడ్డి సమంత ప్లేస్ లో తన సినిమా కోసం మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసుకుంది. లేడీ ఒరియాంటెడ్ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మృణాల్ ఠాకూర్ రెండో సినిమా కూడా వైజయంతి బ్యానర్ లోనే చేయడం విశేషం అని చెప్పాలి. నందిని సినిమా హిట్ అయితే ఆమె టాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ కథలకి కూడా కేరాఫ్ గా మారిపోయే అవకాశం ఉందని చెప్పాలి.