Mrunal Thakur : లోక్ మత్ స్టైలిష్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం స్టన్నింగ్ అవుట్ ఫుట్ తో చలరేగిపోయింది సీతామహాలక్ష్మి. అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన ముద్దుగుమ్మలందరు అదిరిపోయే దుస్తులు వేసుకున్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మృణాల్ ఠాకూర్. రెడ్ కార్పెట్ పైన అదిరిపోయే డ్రెస్ వేసుకొని అందరి చూపులు తల వైపు తిప్పుకుంది. స్టైలిష్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మృణాల్. క్షణాల్లో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. పిక్స్ చూసిన ఫ్యాన్స్ అందరూ లైకులు , షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఇంస్టాగ్రామ్ వేదికగా అవుట్ స్టాండింగ్ దుస్తులను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో చేసిన సీతారామమ్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో అవార్డ్ ఫంక్షన్ కోసం ఫెస్టివల్ సీజన్లోనూ ఫ్యూజన్ అవుట్ ఫిట్ వేసుకొని అందరి మైండ్ బ్లాక్ చేసింది మృణాలు. కో ఆర్డ్ సెట్ వేసుకొని మోడర్న్ వుమన్ గా ఓ మెరుపు మెరిసింది మృణాల్.

ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నాకు మ్యూస్ గా వ్యవహరించింది మృణాల్. ఆమె షెల్ఫ్
నుంచి ఈ అద్భుతమైన అవుట్ ఫిట్ వేసుకుంది. బూడిద రంగులో డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజు వేసుకొని దానికి జోడీగా పొడవాటి సాటిన్ తెల్లని స్కర్ట్ ని ధరించింది. తన లుక్ ని మరింత డ్రామాటిక్ గా మార్చుకునేందుకు మృణాల్ ఆక్సిడైజ్డ్ గోల్డెన్ అలంకరణలతో వచ్చిన లాగ్ డెలిమ్ జాకెట్ వేసుకుంది.

అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా చెవులకు వైట్ ఇయర్ రింగ్స్. మెడలు పూలమాలలా డిజైన్ చేసిన లాంగ్ నెక్ చైన్ ను వేసుకుంది. ఆమ్రపాలి జువెల్స్ నుంచి ఈ జ్యువెలరీని కలెక్ట్ చేసింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ మృణాల్ కు స్టైలిష్ లుక్ అందించింది. పొడవాటి పోనిటైల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ లోచన్ అసిస్టెన్స్ తో అందాలకు మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ షాడో, మస్కారా, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ వేసుకుంది.