Mrunal Thakur : తన క్యూట్ నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది అందాల చందమామ మృణాల్ ఠాకూర్ . నటన పరంగానే కాదు ఈ చిన్నది ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. మృణాల్ ఠాకూర్ తన అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఎప్పటికప్పుడు స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ ధరించి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటుంది. ఇటీవలి ఈ సుందరి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని చిత్రాలను ఇన్ స్టాలో పంచుకుంది. అద్భుతమైన తెల్లని అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి అదుర్స్ అనిపించింది.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ జాబెల్లాకు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం డిజైనర్ హౌస్ షెల్ఫ్ నుండి తెల్లటి అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. గతం లోనూ అనేక ఫ్యాషన్ హౌస్ ల నుంచి అవుట్ ఫిట్స్ ను ఎన్నుకుని ఇంప్రెస్స్ చేసింది ఈ బ్యూటీ.

లేపెల్ కాలర్, ఉబ్బిన హాఫ్ స్లీవ్‌లు, వి-నెక్‌లైన్ , ప్లీటెడ్ డీటైల్స్ తో వచ్చిన తెల్లటి సీక్విన్డ్ టాప్ వేసుకుంది. బ్రాడ్ లెగ్స్ తో వచ్చిన తెల్లటి ప్యాంట్ ను ఈ టాప్ తో జత చేసింది.ఈ లుక్ లో మృణాల్ ఎంతో అందంగా కనిపించి అందరిని ఫిదా చేసేసింది.

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అనాయా జ్యువెలరీ హౌస్ నుండి తెల్లటి ఇయర్ స్టడ్‌లు, చేతి ఉంగరాలు , డైమండ్ `బ్రాస్‌లెట్ ను సేకరించింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా జె గిలానీ మృణాల్ కు స్టైలిష్ లుక్స్ అందించాడు. ఇండోర్ ఫోటోషూట్ కోసం మృణాల్ తన కురులతో క్లీన్ పోనీటైల్ వేసుకుంది. ఈ లుక్ లో మృణాల్ కుర్రాళ్లకు తెగ నచ్చేసింది.

మేకప్ ఆర్టిస్ట్ లోచన్ సహాయంతో, మృణాల్ తన లుక్స్ ను మరింత ఎఫెక్టీవ్ గా మార్చుకుంది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలు మస్కరాను నిండగా గీసి , చెంపలను బ్లష్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తనలోని గ్లామర్ లుక్ ను మరోసారి కుర్రాళ్ళకు చూపించి కవ్వించింది.
