Mrunal thakur: మృణాల్ ఠాకూర్ నిన్న మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేనటువంటి ఈ మరాఠీ ముద్దుగుమ్మ సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. అచ్చం తెలుగుదనం ఉట్టిపడేలా సీతారామం సినిమాలో ఈమె కట్టు, బొట్టు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి. ఇలా సీతారామం సినిమా ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో మరికొన్ని అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
తెలుగులో ఈమె సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ ఈమె నటించిన పలు బాలీవుడ్ మరాటి సినిమాలు కనుక చూస్తే ఈమె ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించి సందడి చేశారు. ఈమె గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే విట్టిదండు, సూపర్ 30, టూఫాన్, ధమాకా, హిందీ జెర్సీ వంటి పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలలో ఈమె గ్లామర్ పాత్రలో నటించి హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు.
ఇలా గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున బోల్డ్ పాత్రలలో నటించిన ఈమెను సీతారామం సినిమాలో తీసుకొని ఈమెను సీత పాత్రలో చూపించడానికి డైరెక్టర్ హనురాగవపూడి పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలలో నటించిన ఈమెను సౌత్ ఇండస్ట్రీకి మాత్రం ఒక పద్ధతి గల అమ్మాయిగా దర్శకుడు పరిచయం చేశారు. అయితే ఈ హీరోయిన్ విషయంలో డైరెక్టర్ అను రాఘవపూడి గొప్ప ప్రయత్నం చేశారని చెప్పాలి.
Mrunal thakur: ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర సంపాదించుకున్న సీతమ్మ..
ఈ సినిమా కనుక ఏమాత్రం అటో ఇటో తేడా కొట్టిన భారీ నష్టం ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ హను రాఘవపూడి ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేలా ఈమె పాత్రను డిజైన్ చేసి ఈమెను హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా సీతామహాలక్ష్మి పాత్రలో ఈమె వెండితెర సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిందని చెప్పాలి. మొత్తానికి డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఈమె పాత్ర ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని చెప్పాలి.