MP cleans toilet : దేశంలో రాజకీయ నాయకులు సీజన్ ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటారు అని అందరికి తెలిసి విషయం. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కొందరు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపు, పాపులారిటీని సంపాదించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ఓ ఎంపీ చేసిన పనితో దేశం మొత్తం ఆయన పేరు మోగుతోంది.
మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఎంపీగా ఉండి అలా చేశారేంటబ్బా అంటూ చర్చించుకుంటున్నారు. ఎంపీగారు తాను చేసిన పనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా సెన్సేషన్ గా నిలిచారు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏం చేశారో తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి.
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో బీజేపీ యువమోర్చా సేవా పఖ్ వాడా ప్రచారంలో భాగంగా ఎంపీ జనార్దన్ మిశ్రా.. ఖత్ఖారీ బాలిక పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న బాలికల టాయిలెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించి.. ఎవరూ ఊహించని పని చేశారు. తన చేతులతో టాయిలెట్ ను ఎంపీ క్లీన్ చేశారు.
MP cleans toilet :
ఒక ఎంపీ టాయిలెట్ ని, అది కూడా చేతితో క్లీన్ చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ‘నేను పాఠశాలను సందర్శించినప్పుడు టాయిలెట్ మురికిగా కనిపించింది. అందుకే దాన్ని శుభ్రం చేశాను. ఇది పెద్ద విషయమేమీ కాదు’ అంటూ ఎంపీ జనార్దన్ మిశ్రా చెప్పుకొచ్చారు. కాగా ఎంపీ చేసిన పనికి నెటిజన్ల నుండి విపరీమైన స్పందన వస్తోంది. ఇలాంటి వారు మనకు కావాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.