కోవిడ్ కేసులు విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలలో ఆంక్షలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.తాజాగా ఈ లిస్ట్ లోకి తమిళనాడు కూడా చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్ కు తాళం వేసింది.దీంతో అజిత్ హీరోగా నటిస్తున్న వలీమై మూవీ వాయిదా పడింది.ఈ మూవీలో అజిత్ సరసన శ్రీదేవి గారాల పట్టి జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో విలన్ గా టాలీవుడ్ యువ హీరో కార్తికేయ కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ బాటలోనే ఈ నెల రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వెళ్లనున్నాయి. అయిపోయిందనుకున్న కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుండడంతో అన్ని రంగాల వారు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు