Mouni Roy : ఫ్యాషన్ క్వీన్, మౌని రాయ్, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో చేసిన బోల్డ్ అండ్ గార్జియస్ పిక్స్ పంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంది. బ్రహ్మాస్త్ర లో నెగటివ్ షేడ్ లో కనిపించిన ఈ బోల్డ్ బ్యూటీ కి ఈ మధ్యన బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఫోటో షూట్ లు చేస్తూ బిజీ బిజీ గా ఉంటోంది ఈ భామ.

సోషల్ మీడియా లోనూ తెగ ఆక్టివ్ గా ఉంటుంది ఈ సొగసరి. ఎప్పటికప్పు అందమైన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది. ఈ బ్యూటీ తాజాగా మెజెస్టిక్ స్కర్ట్ సెట్ తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నెట్టింట్లో వేడిని పెంచింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

రాళ్లు, గొలుసులతో కూడిన హై-నెక్ బ్లౌజ్ వేసుకుని, తొడ ఎత్తైన స్లిట్ తో వచ్చిన స్కర్ట్ వేసుకుని మౌని రాయ్ తన డ్రమాటిక్ లుక్ లో అదరగొట్టింది.

మౌని రాయ్ ఈ ఆవుట్ ఫిట్ ను అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ గుల్నోరా ముఖెదినోవా డిజైన్స్ నుంచి ఎన్నుకుంది. మౌని రాయ్ ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సెలెక్ట్ చేసిన మెటాలిక్ గోల్డెన్ పాయింటెడ్ హీల్స్ ను జత చేసింది.

ప్రముఖ సెలెబ్రిటీ స్టైలిస్ట్ మేనెక హరి సింఘాని మౌని రాయ్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ చెట్టియార్ ఆల్బర్ట్ మౌని అందానికి మెరుగులు దిద్దింది.

కనులకు బ్లాక్ వింగేడ్ ఐ లైనర్ , కను రెప్పలకు పింక్ ఐ షాడో, పేదలకు న్యూడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది.