Mouni roy : మౌని రాయ్ ఫ్యాషన్ డైరీలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ లక్ష్యాలను ప్రతి రోజూ అందిస్తూ ఫ్యాన్స్ ను మంత్ర ముగ్ధులను చేస్తోంది. అద్భుతమైన గౌన్‌ల నుండి సాధారణ క్యాజువల్ అవుట్ ఫిట్స్ వరకు మౌని ప్రతి లుక్ లోనూ కుందనపు బొమ్మలా కనిపిస్తూ కవ్విస్తుంది. తాజాగా మౌని అద్భుతమైన గౌనుతో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ఈ పిక్స్ కింద ఫ్లై మీ టు ది మూన్ అని కాప్షన్ ని జోడించింది.

Mouni roy : మౌని ఫ్యాషన్ డిజైనర్ హౌస్ సోల్ ఏంజెలాన్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం, డిజైనర్ హౌస్ షెల్ఫ్ నుండి మెటాలిక్ గౌనుని ఎంచుకుంది. ఈ మెరూన్ సీక్విన్ గౌన్ లో మెరిసిపోయింది మౌని. ఆఫ్ షోల్డర్ ,బాడీ హగ్గింగ్ డ్రెస్ లో తన ఫిగర్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తూ పరేషాన్ చేస్తోంది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ మౌని కి స్టైలిష్ లుక్స్ ను అందించాడు.మేకప్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ చెట్టియార్ మౌని అందాలకు మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ వింగేడ్ ఐలైనర్, మస్కరా వేసుకుని, కనుబొమ్మలను డార్క్ చేసుకుంది.

పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది. ఈ హాట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఫోటో లకు ఇన్ బాక్స్ లో ముద్దులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

లేటెస్ట్ గా మౌని మరో ట్రెండింగ్ అవుట్ ఫిట్ వేసుకుని ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. పార్టీ స్టైల్ లుక్ లో కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ టుటస్ కుర్నియాటికి మౌని మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి ఫోటో షూట్ కోసం అద్భుతమైన బ్లాక్ డ్రెస్ ను ఎన్నుకుంది. పఫ్ఫి ఫుల్ స్లీవ్స్ బాడీ కాన్ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన ఆఫ్ షోల్డర్ బ్లాక్ వెల్వెట్ డ్రెస్ లో హాట్ చిక్ ల కనిపించింది ఈ బ్యూటీ. ఈ అవుట్ ఫిట్ తో వింటర్ ఫ్యాష స్టేట్మెంట్స్ అందిస్తోంది.
