Mouni Roy : నాగినిగా స్క్రీన్ మీద కనిపించి ఫేమస్ అయిన బ్యూటీ మౌని రాయ్ . బాలీవుడ్ లో ఈ భామకు భలే క్రేజ్ ఉంది. బుల్లితెర , వెండి తెర మీదనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ జీరో సైజు బ్యూటీ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికమే. డ్యాన్స్ మూవ్స్ తో ఇరగదీయడమే కాదు నటిగా కూడా తన ట్యాలెంట్ ఏమిటో నిరూపించుకుంది. ఇటీవల బ్రహ్మాస్త్ర చిత్రంలో ప్రతినాయకు రాలి పాత్రలో తన నటనతో మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ని ఇన్‌స్టాగ్రామ్‌లో 25.3 మిలియన్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. వారిని ఇంప్రెస్స్ చేసేందుకు తరచుగా రకరకాల ఫ్యాషన్ ఫోటో షూట్స్ ను పోస్ట్ చేస్తుంటుంది.

Mouni Roy : తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఎవరినైనా మంత్రముగ్దులను చేయగలదు మౌని రాయ్ . తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో హాటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది. మోనోక్రోమ్ స్కర్ట్ సెట్‌లో తన అందాలను పరిచి యూత్ కు పిచ్చెక్కించింది ఈ బ్యూటీ.

పఫ్ షోల్డర్స్ , ప్లంగింగ్ నెక్ లైన్ ఫుల్ స్లీవ్స్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ కి జోడీగా ఫ్లోయి స్కర్ట్ ను వేసుకుంది. బోహో చిక్ వైబ్స్ వచ్చేలా తన కర్లీ కురులను మధ్య పాపిట తీసుకోని లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్ తో మెస్మెరైజ్ చేసింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో వింగెడ్ ఐ లైనర్ , మస్కారా వేసుకుని ఐ బ్రోస్ ను డార్క్ చేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది.

మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను రోజూ షేర్ చేస్తూనే ఉంటుంది. సాధారణ వస్త్రధారణ నుండి ఎత్నిక్ అవుట్ ఫిట్ వరకు, మౌని ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉంటాయి. మౌని ఫ్యాషన్ మంత్రం సరళమైనది . ప్రతి అవుట్ ఫిట్ లో ఈ భామ మెరుగ్గా కనిపిస్తుంది. ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసే ప్రతి ఒక్క పిక్ అభిమానులను ఉలిక్కిపడేలా చేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
