Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ అందాల నటి మౌని రాయ్ తన మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులకు అత్యద్భుతమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తోంది. రీసెంట్ గా మౌని సోషల్ మీడియాలో తన అప్డేటెడ్ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. అమ్మడి నాజుకు అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

మౌని రాయ్ ఫ్యాషన్ ఎంపికలు ఎల్లప్పుడూ ఒక ట్రీట్‌గా ఉంటాయి. ఆమె అద్భుతమైన బికినీల నుండి సొగసైన చీరల వరకు మరెన్నో, సార్టోరియల్ ఎంపికలు ఆమె వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబిస్తాయి. ఈ బ్యూటీ వస్త్రాలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఎత్నిక్ దుస్తులతో ఈ భామ చేసే మ్యాజిక్ అందరికి నచ్చి తీరుతుంది. తాజాగా నటి అందమైన గులాబి రంగు అనార్కలీ సూట్‌లో దర్శనమిచ్చి అల్ట్రా-గ్లామ్ లుక్స్ తో అదరగోటింది.
సొగసైన అనార్కలీ సూట్ తో ఏంటో అద్భుతంగా కనిపించింది.

అద్భుతమైన ఎంబ్రాయిడరీ నమూనాలు ఈ అవుట్ ఫిట్ కులం మరింత వన్నెను తీసుకు వచ్చాయి. తన రూపానికి చక్కదనాన్ని జోడించింది. ఫుల్ స్లీవ్స్ డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్, నడుము దగ్గరి నుంచి వచ్చిన భారీ ఫ్రిల్స్ మౌని అందాలను అద్భుతంగా చూపించాయి. ఆమె మినిమల్ గ్లామ్‌తో చాలా క్యూట్ గా కనిపించింది.
కనులకు న్యూడ్ ఐ షాడో , కాను రెప్పలకు మస్కారా, వింగేడ్ ఐ లైనర్ , పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

ఈ పింక్ కలర్ అనార్కలి కి సెట్ అయ్యే విధంగా స్టేట్‌మెంట్ భారీ జుంకాలను , నుదుటన పాపిట బిళ్ళను పెట్టుకుంది. తన రూపానికి అదనపు అందాలను జోడించింది. ఈ జ్యువెల్లరీ మౌని కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఆభరణాలను గమనిస్తే వింటేజ్ లుక్ లో కనిపిస్తాయి.

దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, సూరజ్ నంబియార్ ను మౌని గత ఏడాది పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తరవాతే అమ్మడు మరింత జోష్ తో తన కెరీర్ లో కొనసాగుతోంది. వరుస ఫోటో షూట్ లతో సోషల్ మిడిల్ లో రచ్చ రచ్చ చేస్తోంది మౌని.
