Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. రెండు వారాల పాటు సాగిన ఈ సీజన్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో షానీ, అభినయ శ్రీ ఉన్నారు. దీంతో 21 మంది కంటెస్టెంట్స్ కాస్త 19కి చేరారు. ఇక ఇందులో రానున్న రోజుల్లో ఎవరు ఉంటారు… ఎవరు హౌస్ లో నుండి వెళ్లిపోతారు అనేది వేచి చూడాలి. ఈ క్రమంలో ప్రతి వారం ఎప్పటిలాగే హౌస్ లో ఎలిమినేషన్స్ జరుగుతూనే ఉంటాయి.
గడిచిన రెండు వారాల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎవరికి వారు సేఫ్ గా ఉండేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను ఆడుతున్నారు. టాస్క్ లేని సమయంలో మాత్రం కంటెస్టెంట్స్ హాయిగా హౌస్ లో కబుర్లు చెప్పుకుంటూ, వంటలు వంటుకుని తింటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ఓ పర్సన్ మాత్రం చాలా మంది కంటెస్టెంట్స్ కి మోస్ట్ వాంటెడ్ గా తయారయ్యారు. ఇంతకీ ఎవరా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అనుకుంటున్నారా..?
తెలుగు టాప్ సింగర్ రేవంత్ హౌస్ లో మెస్ట్ వాంటెట్ లిస్ట్ లో ఉన్నాడనే చెప్పవచ్చు. ఎందుకంటే రెండు వారాల పాటు సాగిన ఎపిసోడ్స్ లో ఎక్కువగా రేవంత్ తోనే హౌస్ సభ్యులకు వాదనలు జరిగాయి. హౌస్ లో వాదనలు, ప్రేమ, ఆప్యాయతల పలకరింపులు జరగడం సర్వసాధారణమే. కానీ, రేవంత్ తనకు నచ్చినట్లుగా తను ఉండేందుకు ప్రయత్నిస్తున్నారో.. లేక గేమ్ లో భాగంగా తను అలా ప్రదర్శిస్తున్నారో హౌస్ సభ్యులకు అర్ధం కావడం లేదు.
దీంతో చాలా సందర్భాల్లో రేవంత్ కి హౌస్ లో ఉన్న సభ్యులకు మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఓ క్రమంలో అయితే రేవంత్ తీరుకు గీతూ రాయల్ బాత్ రూంలోకి వెళ్లి మరీ బాధపడిన సంఘటనలు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇకపై కూడా ఇలానే రేవంత తీరు కొనసాగుతూనే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి బలమైన ఉదాహరణ ఆదివారం ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. ఆదివారం ఎలిమినేట్ అయిన అభినయ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వెళ్లి రేవంత్ పై హాట్ కమెంట్స్ చేసింది. హౌస్ లో రేవంత్ కన్నింగ్ ఫెలో అంటూ చివరి బాంబ్ వేసి వెళ్లిపోంది. మోస్ట్ వాంటెట్ లిస్ట్ లో ఉన్న రేవంత్ తన తీరును మార్చుకుంటారా.. లేక తన వ్యక్తిత్వంతోనే బిగ్ బాస్ టాస్క్ లను పూర్తి చేస్తూ టైటిల్ రేస్ లో ఉంటారా అనేది చూడాలి మరి..!