ప్రస్తుతం డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమాచారం కావాలన్న వెంటనే గూగుల్ మీద ఆధారపడుతున్నాం. ప్రతి చిన్న విషయాన్ని ఆన్ లైన్ లో శోదించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక గూగుల్ లో కూడా ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక ఇండియాలో గూగుల్ లో ఎక్కువ మంది వెతికేందుకు ఆసక్తి చూపించే అంశాలలో స్పోర్ట్స్ మొదటి స్థానంలో ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. యూత్ ఎక్కువగా స్పోర్ట్స్ అంటే క్రేజ్ తో ఉంటారు. ఆ తరువాత జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మళ్ళీ ఎక్కువగా గూగుల్ లో అన్వేషించే అంశాలు అంటే సినిమా అని చెప్పాలి.
సినిమాలకి సంబందించిన సమస్త సమాచారం క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది కాబట్టి గూగుల్ మీద ఆధారపడతారు. అలా ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది అన్వేషించిన సినిమాల గురించి చర్చించుకుంటే మొదటి స్థానంలో బాలీవుడ్ హిట్ మూవీ బ్రహ్మాస్త్ర ఉంది. ఈ సినిమా బాలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకున్న మొదటి సినిమా అని చెప్పాలి. కలెక్షన్ పరంగా తక్కువ వచ్చిన హిందీ చిత్ర పరిశ్రమకి కాస్తా ఊరట కలిగించిన మూవీగా బ్రహ్మాస్త్ర నిలిచింది. ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి గూగుల్ లో ఎక్కువగా శోధించారు. ఆ తరువాత యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీని గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేశారు.
ఈ సినిమా టీజర్ ఈ ఏడాది అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్, లైక్స్ కూడా సొంతం చేసుకున్న టీజర్, ట్రైలర్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ పేరు మీదనే ఉన్నాయి. వీటి తర్వాత అత్యధికంగా వెతికిన చిత్రాల జాబితాలో ది కాశ్మీర్ ఫైల్ మూవీ ఉంది. ఈ మూవీ కూడా సూపర్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే దేశ వ్యాప్తంగా కాశ్మీర్ లో పండిట్స్ ఊచకోత గురించి ప్రతి ఒక్కరు చర్చించుకునేలా చేసింది. దీని తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఎక్కువ మంది వెతికారు. ఇక ఈ ఏడాది చివర్లో వచ్చి దేశ వ్యాప్తంగా సంచలన విజయం సొంతం చేసుకున్న కాంతారా మూవీ కూడా టాప్ 5లో ఉండటం విశేషం. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది సినిమా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారని ఈ సెర్చ్ రిజల్ట్ బట్టి అర్ధమవుతుంది.
Advertisement