అందాల భామలకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో వారు పెట్టె హాట్ హాట్ ఫోటో షూట్ ల కోసం ఎక్కువ మంది వారిని అనుసరిస్తూ ఉంటారు. ఒక ఫాన్స్ ని ఆనందపరచడానికి హీరోయిన్స్ కోసం వీలైనంత గ్లామర్ తో సోయగాలని తెరచి చూపిస్తూ ఫోటోలతో అందాల జాతర చేస్తూ ఉంటారు. అయితే ఎంత సోషల్ మీడియా పాపులారిటీ ఉన్న ఎక్కువ మంది చర్చించుకోవాలన్నా, ఎక్కువగా మీడియా దృష్టిలో పడాలన్నవారికి సంబందించిన సినిమాల విషయంలో కానీ, వారి వ్యక్తిగత విషయాలలో కానీ హీరోయిన్స్ కచ్చితంగా హాట్ టాపిక్ గా ఉంటూ ఉండాలి.
అలాంటి వారి గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఓర్ మ్యాక్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ గా నిలిచిన వారి జాబితాని ప్రకటించింది. ఇందులో ఇండియన్ వైడ్ గా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత నిలవడం విశేషం. ఈమె గురించి ఎక్కువగా ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె తర్వాత రెండో స్థానంలో రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో నయనతార, నాలుగో స్థానంలో కాజల్ అగర్వాల్, ఐదో స్థానంలో దీపికా పదుకునే నిలిచారు.
ఆ తరువాత వరుసగా రష్మిక, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి నిలవడం విశేషం. ఇలా ఇండియన్ వైడ్ గా పాపులారిటీ హీరోయిన్స్ జాబితాలో మెజారిటీ అందాల భామలు టాలీవుడ్ నుంచి ఫేమ్ తెచ్చుకొని పాన్ ఇండియా స్థాయిలో తమ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వారు కావడం విశేషం. ఇక అనుష్క శెట్టి బాహుబలి సినిమా తర్వాత లైమ్ లైట్ లేకపోయిన ఎక్కువ మంది ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారని ఈ సర్వే బట్టి తెలుస్తుంది.