బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్,పూజ హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గత కొంతకాలంగా హిట్ ల కోసం పరితపిస్తున్న అఖిల్,బొమ్మరిల్లు భాస్కర్ కు ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందించి ఊరటనిచ్చింది.కరోనా టైంలో థియేటర్స్ లో విడుదలై యు.ఎస్ బాక్స్ వద్ద హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ నిలిచింది.
తాజాగా ఈ మూవీ 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి 50 కోట్ల క్లబ్ లో చేరింది.50 కోట్ల మైలు రాయిని అందుకున్న తొలి చిత్రంగా అఖిల్ కెరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రికార్డ్ నమోదు చేసింది.