బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్,పూజ హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినీ అభిమానులను ఆకట్టుకొని హిట్ ల కోసం గత కొంతకాలంగా పరితపిస్తున్న అఖిల్,బొమ్మరిల్లు భాస్కర్ కు ఊరటనిచ్చింది.కరోనా తర్వాత రిలీజ్ అయిన చిత్రాలలో ఒకటైన ఈ చిత్రం తాజాగా ఒక అరుదైన రికార్డు ను బ్రేక్ చేసింది.మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం థియేటర్స్ కు వరసగా సినిమాలు వస్తున్నప్పటికీ కరోనాకి భయపడిన జనాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలు చూడడానికి థియేటర్స్ కు రావట్లేదు అందుకే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ఓటిటి సంస్థలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లకు ప్రయత్నిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందరూ ఊహించిన దానికంటే మెరుగ్గా రాణిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది.
తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ యు.ఎస్ బాక్స్ వద్ద హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకుంది.కరోనా టైంలో ఈ మార్క్ ను అందుకున్న మూవీస్ లో ఇది నాలుగవ మూవీగా నిలిచింది.ఈ మార్క్ ను ఈ మూవీ కంటే ముందు జాతి రత్నాలు, వకీల్ సాబ్,లవ్ స్టోరీ మూవీస్ అందుకున్నాయి.ఈ మూవీలో పూజ హెగ్డే నటన,గ్లామర్ అఖిల్ పరిణితి చెందిన నటన సినీ అభిమానుల మనసు గెలుచుకుంటుంది.కథ కొంచెం పాతదే అయినా మూవీలోని కొన్ని అద్భుతమైన సీన్స్ కామెడీ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ వీక్ అంతా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసి అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతున్న ఈ మూవీ నుండి చిత్ర యూనిట్ తాజాగా గుచ్చే గులాబీ లాగా వీడియో సాంగ్ ను విడుదల చేసింది.ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీక్ అంత బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేసిన ఈ మూవీ నెక్స్ట్ వీక్ కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి,అందుకోసం సినీ అభిమానులను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ ఈ సాంగ్ ను విడుదల చేసిందని సమాచారం.