సరైన హిట్ లేక సతమతవుతున్న అక్కినేని అఖిల్,బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీపై హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ డైరెక్టర్ సెంటిమెంట్ ప్రకారం ఖచ్చితంగా హిట్ కొడుతుందని బలంగా నమ్ముతున్నారట మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బొమ్మరిల్లు భాస్కర్ తీసిన బొమ్మరిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ మూవీలో ముఖ్యంగా హాసిని క్యారెక్టర్ సినీ అభిమానుల గుండెలలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.ఈ మూవీలో హీరోయిన్ పేరైన హాసిని నిజ జీవితంలో భాస్కర్ పెద్ద కూతురు పేరు ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో తన చిన్న కూతురు పేరును హీరోయిన్ కు పెట్టారు.మరి ఈ సెంటిమెంట్ ఈసారి వర్క్ అవుతుందో లేదో వేచి చూడాలి.