Monal gajjar: మోనాల్ గజ్జర్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. గుజరాతి అమ్మాయి అయినప్పటికీ ఈమె తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్4ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన మోనాల్ గజ్జెర్ ఎంతో అద్భుతమైన డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే ఇలా ఈమె డాన్స్ కు ఎంతో మంది ఫిదా కావడంతో ఏకంగా ఈమె తెలుగులో ప్రసారమైనటువంటి డాన్స్ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం బుల్లితెరపై కాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి కూడా ఈమె న్యాయ నిర్ణీతగా కాకుండా మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా వేదికపై ప్రసారమవుతున్నటువంటి ఈ డాన్స్ షోలో మోనాల్ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే మోనాల్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈమె అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా అందాల ఆరబోతతో కుర్రకారులకి పిచ్చెక్కిస్తున్నటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Monal gajjar: అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న మోనాల్
ఈ విధంగా మోనాల్ గ్లామరస్ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తూ హీరోయిన్ కటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మోనాల్ సైతం హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం కోసమే ఇలా గ్లామర్ షో చేస్తున్నట్టు మరికొందరు భావిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలో ఈమె కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి బాగా పులిహోర కలిపారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున అందరికీ అనుమానం కలిగేలా లవ్ ట్రాక్ నడిపారు. అయితే అదంతా కేవలం బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అందరికీ అర్థం అయింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.