Mokshagna: విజయవాడలోనీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి.ఈ విషయంపై నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి తెలుగుదేశం నేతలు మాట్లాడగా ఘాటుగా వైసిపి మంత్రులు వారికి కౌంటర్ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసిపి మంత్రి బాలకృష్ణను ఉద్దేశిస్తూ అందరూ కలిసి ఆయనని చంపిన తరువాత యూనివర్సిటీకి పేరు పెట్టారు. ఇలా యూనివర్సిటీకి పేరు పెట్టినంత మాత్రాన చేసిన పాపాలు తొలగిపోతాయా అంటూ పెద్ద ఎత్తున బాలకృష్ణ పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులగా బాలకృష్ణ గురించి వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ స్పందించారు.
ఈ సందర్భంగా మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గత రెండు రోజులుగా బాలకృష్ణ మీద కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. మీరు ఎంత అరిచిన బాలకృష్ణ వెంట్రుక కూడా పీకలేరు. అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ల వద్దకు వచ్చారు అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తున్నారు. ఇలాంటి కారు కూతలు కూసే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఫైర్ అయ్యారు.
Mokshagna: కారు కూతలు కూసేవారికి కాలమే సమాధానం చెబుతుంది…
ఈ విధంగా మోక్షజ్ఞ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఈయన ధైర్య సాహసాల పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం సినిమాలలోకి రాకముందే మోక్షజ్ఞ ఇలాంటి ట్వీట్ లు చేస్తేసినిమాలలోకి వచ్చిన తర్వాత ఈయన గురించి వచ్చే విమర్శలపై ఎలా స్పందిస్తారో ఏంటో అని పెద్ద ఎత్తున పలువురు మోక్షజ్ఞ ట్వీట్ పై విమర్శలు చేస్తున్నారు.